సింగరాయకొండలో రెచ్చిపోయిన దొంగలు

ప్రకాశం: సింగరాయకొండలోని అంబేద్కర్ నగర్‌లో శుక్రవారం దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఓ ఇంటిని టార్గెట్ చేసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువాలోని 10 సవర్ల బంగారం, కొంత నగదును దోచుకు వెళ్లినట్లు ఇంటి యజమాని తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.