'క్రమపద్ధతిలో పరిశుభ్రత పనులు జరగాలి'

'క్రమపద్ధతిలో పరిశుభ్రత పనులు జరగాలి'

GNTR: గుంటూరులోని ప్రధాన రోడ్ల వెంబడి పరిశుభ్రత పనులు క్రమ పద్ధతిలో జరగాలని కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. రోడ్లు, డివైడర్లను పూర్తిగా శుభ్రం చేయాలని ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శులకు ఆయన సూచించారు. శనివారం జీటీ రోడ్డు, నల్లపాడు, జేకేసీ కాలేజీ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించి పరిశుభ్రత, అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.