'అంతరిక్షం నుంచి భూమిని చూస్తే అద్భుతంగా ఉంది'

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మీడియా సమావేశం నిర్వహించారు. యాక్సియం 4 మిషన్ కోసం చాలా కష్టపడి పనిచేశామని తెలిపారు. ఈ మిషన్ కోసం మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారని, వారి కృషిని అభినందించారు. ఐఎస్‌ఎస్ నుంచి కొన్ని ఫొటోలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కాగా ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా, ఆయన బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 18 రోజుల పాటు గడిపారు.