నీలోఫర్‌లో చిన్నారులకు తప్పని కష్టాలు
HYD: నీలోఫర్‌లో చికిత్స కోసం వచ్చే చిన్నారులకు కష్టాలు తప్పడం లేదు. చలి పెరుగుతుండడంతో శ్వాసకోశ వ్యాధులతో చాలామంది చిన్నారులు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ ఆసుపత్రిలో దాదాపు వేయి పడకలు ఉన్నప్పటికీ, సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో లేవు. దీంతో నిమ్స్ లేదా ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఖర్చుతో చికిత్స చేయించుకోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.