సామెత - దాని అర్థం
సామెత: ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ
అర్థం: నిజం చెప్పినప్పుడు, తప్పు చేసిన వారికి ఎక్కువ కోపం వస్తుంది.
సందర్భం: ఎవరైనా ఒక వ్యక్తి చేసిన తప్పు గురించి మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి ఆ విషయాన్ని ఒప్పుకోకుండా.. మాట్లాడిన వారిపై కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.