ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు
NLR: నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ, పెళ్లి పేరుతో ఒక మహిళను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన చింతపట్ల మౌర్య అనే యువకుడు, తీరా సమయం వచ్చేసరికి మొహం చాటేసి తనను దారుణంగా మోసం చేశాడంటూ సోమవారం రాత్రి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.