రేపు 56 గ్రామాలకు పోలింగ్
గద్వాల జిల్లాలో డిసెంబర్ 14న అయిజ, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 74 గ్రామ పంచాయతీలకు గాను 18 ఏకగ్రీవం కాగా, మిగిలిన 56 గ్రామాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 567 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించారు. ఈ ఎన్నికల్లో 1,34,601 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.