VIDEO: దీపావళి గ్రామంలో ఘనంగా అయ్యప్ప స్వామి పూజలు

SKLM: గార మండలం దీపావళి గ్రామంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర జ్ఞానాశ్రమంలో ఘనంగా అయ్యప్ప స్వామి పూజలను నిర్వహించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పూలతో అలంకరించి విశేష పూజలు అందజేశారు. ఆశ్రమ నిర్వాహకులు శ్రీరంగం మధుసూదనరావు మాట్లాడుతూ.. స్థానిక ఆశ్రమంలో ప్రతి బుధవారం స్వామివారికి పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.