'అవసరమైన వారికి సాయం చేయాలి'

HYD: మారేడ్‌పల్లి మండల కార్యాలయం వద్ద మితాబ్ అనే దివ్యాంగుడికి సెవెన్ రేస్ ఫౌండేషన్ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంస్థ నిర్వాహకురాలు సారా మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్నవారు ఇబ్బంది పడకుండా తమ వంతు సాయం చేస్తున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ అవసరమైన వారికి చేతనైనంత సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.