గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే వేముల
NLG: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. మంగళవారం నకిరేకల్ మండలం నోముల పాలెం గ్రామాల్లో 25 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయనతో మార్కెట్ ఛైర్మన్ గుత్తా మంజుల, పీఏసీఎస్ ఛైర్మెన్ నాగులవంచ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.