ఆకట్టుకున్న కర్ర సాము ప్రదర్శన
VSP: సంక్రాంతి సందర్భంగా YSR సెంట్రల్ పార్క్‌లో బల్దేవ్స్ ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ టీం ఆదివారం నిర్వహించిన కర్ర సాము ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీపీ శంఖబ్రత బాగ్చీ హాజరై విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. బాలికలు, బాలురు చేసిన కర్రసాము, కత్తిసాము ప్రదర్శనలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని తెలిపారు.