'మహా ధర్నాను విజయవంతం చేయాలి'

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రేపు సోమవారం మహా ధర్నాను నిర్వహించనున్నారు. గీత కార్మికుల మహా ధర్నాను విజయవంతం చేయడానికి కార్మికులు భారీగా తరలిరావాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌తో ఆందోళనకు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు.