రాత్రి 8 నుంచి 8.15గంటల వరకు కరెంట్‌ కట్‌

రాత్రి 8 నుంచి 8.15గంటల వరకు కరెంట్‌ కట్‌

సివిల్‌ డిఫెన్స్‌ మాక్ డ్రిల్‌లో భాగంగా ఢిల్లీలో ఇవాళ రాత్రి 8 నుంచి 8.15గంటల మధ్య విద్యుత్‌ సరఫరాను నిలిపివేయనున్నారు. దీనికి ప్రజలంతా సహకరించాలని న్యూ ఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌(NDMC) విజ్ఞప్తి చేసింది. ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రాష్ట్రపతి భవన్‌, పీఎంవో, మెట్రో స్టేషన్లు, ఇతర ముఖ్య ప్రదేశాలకు ఇది వర్తించదని స్పష్టం చేసింది.