వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య

వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య

NLG: జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన జరిగింది. చింతపల్లి(M) పాలెంతండాలో శ్రీను-జ్యోతి అనే దంపతులున్నారు. అయితే జ్యోతితో ఇదే తండాకు చెందిన రాజు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో రాజు కోపంతో జ్యోతి నుదిటిపై రాయితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.