రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

జగిత్యాల: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీలలో జగిత్యాల ఓల్డ్ హైస్కూల్ విద్యార్థులు పి. శివకుమార్ (కబడ్డీ), అక్షిత్ (బాస్కెట్ బాల్) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంఈవో ధరావత్ చంద్రకళ శుక్రవారం విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.