చిట్యాలలో చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలు..

చిట్యాలలో చెల్లుబాటు అయిన నామినేషన్ల వివరాలు..

NLG: చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను 150 నామినేషన్లు దాఖలు కాగా 123 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. వాటిలో 27 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు చెప్పారు. 180 వార్డు స్థానాలకు గాను 595 నామినేషన్లు రాగా.... వాటిలో 559 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు వివరించారు. 36 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యినట్లు వెల్లడించారు.