కదలని ఏనుగుల గుంపు
PPM: జియ్యమ్మవలస మండలంలో గత కొద్ది రోజులుగా సంచరిస్తున్న ఎనిమిది ఏనుగుల గుంపు మండలం నుంచి కదలకుండా ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. బాసంగి, గదబవలస, గిజబ, పాత గిజబ గ్రామాల పరిసరాల్లో తిరుగుతూ రైతులు కష్టపడి పండించిన అరటి, మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు.