అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు: శివారెడ్డి
NRPT: నారాయణపేట నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ వారు అందించారు.