రైతుల సమస్యలపై మాజీ మంత్రి ఆరా

రైతుల సమస్యలపై మాజీ మంత్రి ఆరా

KKD: మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు శుక్రవారం కరపలో పర్యటించి రబీ సాగుపై రైతులను ఆరా తీశారు. సాగునీటి ఎద్దడి వల్ల పడుతున్న ఇబ్బందులను రైతులు ఆయనకు వివరించారు. అనంతరం కరపలోని కాశీ వారాహి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఆయన, ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.