CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

CTR: కుప్పం నియోజకవర్గ పరిధిలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 36,09,854 రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు నిధులకు సంబంధించి చెక్కులను బాధితులకు ఆదివారం కుప్పం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. కాగా, బాధితులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.