బ్రహ్మోత్సవాలకు మంత్రి అచ్చెన్నకు ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు మంత్రి అచ్చెన్నకు ఆహ్వానం

SKLM: నరసన్నపేట కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడుకి ఆహ్వాన పత్రికను ఆలయ ధర్మకర్తలు అందజేశారు. మంగళవారం సాయంత్రం కోటబొమ్మాలి మండలం నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రిని వారు కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి కృష్ణమాచార్యులు, జగదీశ్ శర్మ పాల్గొన్నారు.