ఈ నెల 24న జిల్లాకు మంత్రి జూపల్లి రాక

ఈ నెల 24న జిల్లాకు మంత్రి జూపల్లి రాక

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 24న పర్యటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం రోడ్డు మార్గాన జిల్లాకు చేరుకొని ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బోథ్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.