సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: బూర్జ మండలం చీడివలసలో రూ.1 కోటి 2 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. గ్రామాల్లో రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతులు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని పేర్కొన్నారు.