నేటితో ముగియనున్న సీపీఐ మహాసభలు

TG: సీపీఐ రాష్ట్ర మహాసభలు ఇవాళ్టితో ముగియనున్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని గాజులరామారంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలు ఈ సాయంత్రం ముగుస్తాయి. కూనంనేని సాంబశివరావును రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగించే అవకాశం ఉంది. ఈ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని పార్టీ నిర్ణయించింది.