చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో మిన్నంటిన గణతంత్ర వేడుకలు
SRPT: చివ్వెంల మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో 77వ గణతంత్ర వేడుకలు పండుగలా జరిగాయి. ఎస్సై మహేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛా వాయువులని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల రక్షణే లక్ష్యంగా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు.