డాక్టర్ అనూషకు సర్టిఫికెట్ ప్రధానం
గుంటూరు: జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో జరిగిన గర్భాశయ క్యాన్సర్ శిబిరంలో మంగళగిరి యూపీహెచ్‌సీ వైద్యాధికారి డా.అనూష సర్టిఫికెట్ అందుకున్నారు. అమెరికా పీఐఎన్సీసీ ఆధ్వర్యంలో 4 రోజులపాటు వీఐఏఏ, థర్మోకోయాగ్యులేషన్‌లో ఆమె శిక్షణ పొందారు. గురువారం అంతర్జాతీయ నిపుణులు డా.జీన్ టార్బర్డ్ చేతులమీదుగా ఆమె ఈ ధ్రువపత్రం స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు.