సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA
NTR: నందిగామ మండలం ఐతవరం గ్రామంలో రూ.44 లక్షలతో సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఎంపీ ఆర్. కృష్ణయ్య MPLADS నిధులతో చేపడుతున్న ఈ పనులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. రహదారి నిర్మాణంతో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుందన్నారు.