డిగ్రీలోప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కడప: పట్టణంలోని యోగి వేమన విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్, బీకాం కంప్యూటర్స్ అప్లికేషన్స్, బీఎస్సీ, ఫిజిక్స్,కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలుంటాయన్నారు.