అనధికార స్టిక్కర్‌లు వినియోగిస్తే చర్యలు

కృష్ణా: స్టిక్కర్‌లు విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు. సీఎంవో, పోలీస్ సైరన్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్టిక్కర్లు అనుమతి లేకుండా వాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. రాజకీయ నేతలు, అధికారుల పేరుతో మోసాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శనివారం ఆయన హెచ్చరించారు. అనధికారిక స్టిక్కర్లు వేసుకుంటే చర్యలు తప్పవన్నారు.