ఉత్సాహంగా జరుగుతున్న గిగ్స్ క్రీడా పోటీలు
SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నియోజకవర్గ గిగ్స్ క్రీడా పోటీలు ఇవాళ ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు మండలం నుంచి విద్యార్థులు ఈ పోటీలలో ఉత్సవంగా పాల్గొన్నారు. కబడ్డీ, కోకో వాలీబాల్, బ్యాట్మెంటన్, రన్నింగ్ పోటీలు నాలుగు రోజులు పాటు నిర్వహిస్తున్నట్లు పీఈటీలు నవీన్, అప్పయ్య, సురేష్‌లు తెలిపారు.