ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి: కలెక్టర్
VKB: వందేమాతరం జాతీయ గేయం దేశ సమైక్యతకు తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో కలిసి సామూహిక వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.