మద్యం తాగి వాహనాలు నడిపిన వ్యక్తులకు జైలుశిక్ష
VZM: మద్యం తాగి వాహనాలు నడుపుతూ వివిధ పోలీసు స్టేషన్‌లలో పట్టుబడిన ఆరుగురు వ్యక్తులకు రూ.10 వేలు జరిమానా, వారంరోజులు జైలుశిక్ష విధిస్తూ కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి డా,ఎస్. విజయ్ చందర్ బుధవారం తీర్పు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవలస పోలీసు స్టేషన్ లో 3, లక్కవరపుకోట పోలీసు స్టేషన్ 2, వల్లంపూడి పోలీసు స్టేషన్ 1 నమోదైనట్లు చెప్పారు.