బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కు పాదం
కృష్ణా: బెట్టింగ్ రాయుళ్లపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కు పాదం మోపుతోంది. తాజాగా ఇవాళ మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, గన్నవరంలో క్రికెట్ బెట్టింగులు, పేకాట శిబిరాలు, కోడిపందాల నిర్వాహణపై దాడులు నిర్వహించారు. దాదాపు వంద మందికి పైగా నిందితులని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.