ఘనంగా దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిదవ వార్షికోత్సవ పురస్కరించుకొని ఆర్యవైశ్య మహిళా మహాసభ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. గ్రామంలో కళశాల ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం అర్చన కార్యక్రమం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.