'న్యాయవాదుల సంక్షేమం కోసమే పోటీ'
VSP: ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమమే లక్ష్యంగా తొలిసారిగా రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సీనియర్ న్యాయవాది, విశాఖ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బెవర సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల్లో గెలిచాక విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, న్యాయవాదులకు పింఛన్, జూనియర్ అడ్వకేట్లకు స్టైఫెండ్ వంటి అంశాలపై కృషి చేస్తానన్నారు.