సింగూర్ కు వరద పోటు.. మరో గేట్ ఎత్తి దిగువకు విడుదల

సింగూర్ కు వరద పోటు.. మరో గేట్ ఎత్తి దిగువకు విడుదల

SRD: సింగూర్ ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తడంతో మరో గేటు ఓపెన్ చేసి వరద జలాలు వదిలినట్లు DEE నాగరాజు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 24,531 క్యూసెక్కులు వరద చేరుతుండగా, దిగువకు 20,250 క్యూసెక్కులు 2 క్రస్ట్ గేట్ల ద్వారా మంజీరా నదిలోకి వదిలామన్నారు. అయితే మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.