VIDEO: భారతీయులుగా ముందుకు వెళ్లండి: సీపీ
సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ విద్యార్థులకు సూచనలు చేశారు. వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఓ కార్యక్రమం నిర్వహించింది. కుల, మతాలకు అతీతంగా అందరూ భారతీయులుగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతంలో విద్యార్థులు మంచి నడవడికతో ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలని తెలిపారు.