ఘనంగా లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని రథంపై చేర్చి మాడవీధుల్లో ఊరేగించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, చైర్మన్ రవీందర్ గుప్తా, ఈఓ రంగాచారి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.