గుమ్మగట్ట మండలంలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

గుమ్మగట్ట మండలంలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

ATP: గుమ్మగట్ట మండలం వెంకటాంపల్లి గ్రామ సమీపంలోని బీటీపీ ప్రధాన కాలువలో ఈతకు వెళ్లిన అభిరామ్ (9) మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. పూలకుంట గ్రామానికి చెందిన అభిరామ్ స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలువలో గల్లంతై మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.