ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే

NGKL: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో పలువురు పర్యాటకుల మరణంపై బుధవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. పర్యాటకులపై తీవ్రవాదుల దాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. భారతదేశంలో హింసకు తావు లేదని తెలిపారు.