VIDEO: 'రోగులు పట్ల నిర్లక్ష్యం.. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'రోగులు పట్ల నిర్లక్ష్యం.. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి'

WGL: MGM ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగుచూసింది. గురువారం ఓ రోగిని కేఎంసీ ఆసుపత్రికి పరీక్షల కోసం తరలించేందుకు వైద్యులు సూచించినప్పటికీ పేషంట్ కేర్ సిబ్బంది అందుబాటులో లేకపోయారని బంధువులు తెలిపారు. దీంతో రోగిని స్ట్రెచర్‌పై కుటుంబ సభ్యులే తీసుకెళ్లాల్సి వచ్చినట్లు తెలిపారు. అధికారులు స్పందించి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.