శ్రీ వాసవి అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ

ATP: గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తికి వివిధ రకాల గాజులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి నామస్మరణంతో ఆలయం మారుమోగింది.