విద్యార్థి ఫీజుకు వాసుపల్లి ఆర్థిక సాయం
VSP: దక్షిణ నియోజకవర్గం 30వ వార్డు విద్యార్థి ఈశ్వర్‌కు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.5000 ఆర్థిక సాయం బుధవారం అందించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు విద్య, వైద్యం ఉచితంగా చేరాలన్నది వైసీపీ లక్ష్యమని అన్నారు. యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలని వాసుపల్లి ఆకాంక్షించారు.