అమ్మవారి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

బాసర: శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని గురువారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే నిత్య చండీ హోమంలో పాల్గొన్నారు. ముందుగా వీరికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. వీరికి అర్చకులు తీర్థ ప్రసాదాలతో పాటు ఆశీర్వచానాలు అందజేసి శాలువాతో సత్కరించారు.