ధర్మవరానికి రూ. 35 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరు

ధర్మవరానికి రూ. 35 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరు

సత్యసాయి: ధర్మవరం చేనేత రంగానికి శుభవార్త. ఇవాళ జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ధర్మవరం పట్టణానికి మెగా హ్యాండ్లూమ్ చేనేత క్లస్టర్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం రూ. 35 కోట్లు కేటాయించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన కూటమి నాయకులు పట్టణంలోని చేనేత విగ్రహానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ క్లస్టర్ ద్వారా చేనేత కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు.