పెద్దముడియంలో గ్యార్మీ వేడుకలు

KDP: పెద్దముడియం మండలం నెమ్మళ్లదిన్నె గ్రామంలో గ్యార్మీ(జెండా పండగ) మహోత్సవం గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురువారం కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి హాజరై ప్రత్యేక పార్థనలు, దువా చేశారు. అనంతరం గ్రామస్థులు ఏర్పాటు చేసిన విందులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.