రాజేంద్రనగర్‌లో పాన్‌షాప్‌ నిర్వాహకుడిపై దాడి 

రాజేంద్రనగర్‌లో పాన్‌షాప్‌ నిర్వాహకుడిపై దాడి 

రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌లో వసీం అనే వ్యక్తి పాన్‌షాప్ నిర్వాహిస్తున్నాడు. సిగరెట్లు కొనడానికి షాప్‌కి కొంతమంది వచ్చారు. అయితే సిగరెట్ల విషయంలో వసీంకు, కొనడానికి వచ్చిన వ్యక్తుల మధ్య వివాదం జరిగింది. దీంతో ఆ 10 మంది ముఠా వసీంపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ దాడిలో వసీంకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.