'ధర్మారెడ్డి మరణం తీరని లోటు'
BHNG: తెలంగాణ ఉద్యమ సీనియర్ నేత, BRS నాయకులు, రాజాపేట మండల ఫౌండర్ బూరుగు ధర్మారెడ్డి మరణం తీరని లోటు అని, డీసీసీబీ మాజీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ధర్మారెడ్డి మరణం పట్ల గురువారం ఆయన ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి అకాల మృతితో BRS పార్టీకి తీవ్ర నష్టం చేకూరిందన్నారు.