అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
MDK: అక్రమంగా తరలిస్తున్న మధ్యాన్ని పోలీసులు పట్టుకున్న ఘటన హవేలి ఘనపూర్ మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి వద్ద నుంచి 7 లీటర్లు, మండలంలోని తొగిట గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి 8 లీటర్లు, మరొక వ్యక్తి నుంచి 32 లీటర్లు మొత్తం 47లీటర్ల మద్యంతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.