VIDEO: 'వెంటనే కాలువను శుభ్రం చేయాలి'
WGL: కొత్తవాడలోని బాలగణేశ్ కాలనీలో మురుగు కాలువల పరిస్థితి తీవ్రంగా విషమించింది. డ్రైనేజీల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి కాలువను శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.